ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు 'తెలుగుతల్లికి జలహారతి' అనే పేరును పెట్టినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఏపీకి ఒక గేమ్ ఛేంజర్ లాంటిదని పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని అన్నారు. నదులు అనుసంధానం చేయగలిగితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి నీటి కొరత అనే మాట వినిపించదని స్పష్టం చేశారు.