వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సీఎం చంద్రబాబు

62చూసినవారు
వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సీఎం చంద్రబాబు
ఏపీలోని విజయవాడలో వచ్చిన వరదలపై కేంద్ర ప్రభుత్వానికి నేడు నివేదిక పంపించనున్నారు. వరద నష్టంపై ఇవాళ సాయంత్రానికి ప్రాథమిక నివేదిక, ఆ తర్వాత సమగ్ర నివేదికను కేంద్రానికి అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిల వసూలు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు మినహా మిగతా చోట్ల విద్యుత్తును పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్