ఆగస్టు 1న శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు

85చూసినవారు
ఆగస్టు 1న శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలానికి వెళ్ళనున్నారు. అక్కడ శ్రీశైలం జలాశయాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. కృష్ణా నదిలో జల హారతి సీఎం చంద్రబాబు ఇస్తారు. అలాగే శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సీఎం పరిశీలించనున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఈరోజు అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్