యాలకులలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, నియాసిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు యాలకుల పాలు తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా పాలలో యాలుకుల పొడి కలిపి తాగితే క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.