TG: ఆర్ఎస్ఎస్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో RSS ఎలాంటి త్యాగాలు చేయలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. 'రాహుల్ గాంధీ చెప్పినవి సైద్ధాంతిక విభేదాలు.. భారత స్వాతంత్య్ర పోరాటంలో RSS ఎలాంటి త్యాగాలు చేయలేదు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్య్రం అంటే ఏమిటో గుర్తించడానికి RSS చీఫ్ మోహన్ భగవత్ సిద్ధంగాలేరు. దీనిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి' అని పేర్కొన్నారు.