గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద హైటెన్షన్ (వీడియో)

84చూసినవారు
AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో నిన్న జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులపై గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. పోలీసుల మాట వినకపోవడంతో ఆయనను పీఎస్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్