ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనం అవుతుందని పేర్కొన్నారు. అయితే, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేని పాక్ నిర్వహించలేదని, అది భారత్‌లో విలీనమవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు.