అధికారంలోకి వస్తే సీబీఐ, ఈడీలను మూసేస్తాం: అఖిలేష్ యాదవ్

63చూసినవారు
అధికారంలోకి వస్తే సీబీఐ, ఈడీలను మూసేస్తాం: అఖిలేష్ యాదవ్
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయ కారణాలతో మాత్రమే ఉపయోగించుకుంటుందని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐని మూసివేయాలని ప్రతిపాదిస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘మోసానికి పాల్పడితే ఆ విషయాన్ని ఐటీశాఖ చూసుకుంటుంది. ఆ మాత్రానికి సీబీఐ ఎందుకు? ప్రతి రాష్ట్రంలోనూ ఏసీబీ ఉంది. కావాలంటే దానిని ఉపయోగించుకోవచ్చు’ అని అఖిలేష్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్