తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనుంది. ఈమేరకు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని కేటాయించింది. వారి వద్దకు వెళ్తే పేషెంట్ల వివరాలను సీఎంఆర్ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా? కాదా? సరి చూసి, చెక్ అందజేశారు.