పాములు అత్యంత ప్రమాదకరమైనవి. అవి ఒక్క కాటేస్తే చాలు.. కాటికి వెళ్ళాల్సిందే. అందుకే చాలామందికి పాములంటే చచ్చేంత భయం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ భారీ కోబ్రా దిండు కవర్ కింద దాక్కుంది. దానిని బయటకు తీయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండగా బుసలు కొడుతుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.