కాసేపట్లో జలసౌధలో KRMB కీలక సమావేశం

71చూసినవారు
కాసేపట్లో జలసౌధలో KRMB కీలక సమావేశం
TG: కృష్ణా నీటి వాటాలపై హైదరాబాద్ జలసౌధలో కాసేపట్లో KRMB సమావేశం జరగనుంది. ఈ మేరకు 3:30కి కేఆర్ఎంబీ భేటీ ఉండనుంది. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే తెలంగాణ తన వాదన వినిపించింది. నిబంధనలు ఉల్లంఘించి ఏపీ అధికంగా నీటిని తరలిస్తుందని ఆరోపించింది. నేడు ఏపీ అధికారులు తమ వాదన వినిపించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్