ఉత్తరాఖండ్‌లో గురువారం నిర్మాణంలో ఉన్న భారీ బ్రిడ్జ్ కూలిపోయింది. కొండ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’ కుప్పకూలింది. రుద్రప్రయాగ్‌లో భారీ వంతెనగా ఇది రూపు దిద్దుకుంటోంది. కొండ రాష్ట్రంలో తొలి ‘సిగ్నేచర్ బ్రిడ్జ్’గా పిలిచే దీనిని బద్రీనాథ్ హైవేపై నార్కోటాలో నిర్మిస్తున్నారు. రూ.76 కోట్ల వ్యయంతో ఆర్‌సీసీ డెవలపర్స్ ఈ వంతెనను నిర్మిస్తోంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు.