పోలీస్ స్టేషన్ లో కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం

77చూసినవారు
పోలీస్ స్టేషన్ లో కూలిన సీలింగ్.. తప్పిన ప్రమాదం
AP: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్ స్టేషన్ లో పైకప్పునకు వేసిన సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సెక్టార్ -1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయణ బయట వరండాలో ఉండటంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో గదిలో ఇతర సిబ్బంది కూడా ఎవరూ లేరని ఎస్సై తెలిపారు. పాత భవనం కావడంతో వర్షాలు పడినప్పుడు పైకప్పు లీకు అవుతుండేదని పిఎస్ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్