అయోధ్య శ్రీ రామ్‌లల్లా ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ భారీగా కనిపించింది.
హోలీ పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూశారు.
హోలీ కారణంగా అయోధ్య పట్టణం, శ్రీ రామ చంద్రుడి గుడి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తి గీతాలు ఆలపిస్తూ పండుగ రంగులు అద్ది
హోలీ వేడుకలు జరుపుకున్నారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరిగిన తరువాత తొలిసారి
హోలీ వేడుకలు జరుగుతున్నాయి.