తెలంగాణ మంత్రి సీతక్కతో శనివారం కమెడియన్ అలీ సమావేశమయ్యారు. సచివాలయంలో మంత్రి సీతక్కతో సినీ నటుడు అలీ, డైరెక్టర్ రమణారెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. సామాజిక బాధ్యతతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తాను చిత్రీకరించిన 'నిన్ను నన్ను కన్నది ఆడది రా' అనే పాటను మంత్రికి చూపించారు. పాట ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రావాలని సీతక్కను ఆహ్వానించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈనెల 8 సాయంత్రం పాట ఆవిష్కరణ జరుగనుంది.