తెలంగాణ పంచాయతీ రాజ్శాఖలోని వివిధ విభాగాల్లో 550 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 26 జరిగే క్యాబినేట్ లో చర్చించిన తర్వాత నియామకాలు చేపట్టే ఇచ్చే ఛాన్స్ ఉంది. గత కొన్నేళ్ల నుంచి బాధితులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారానికి నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కారుణ్య నియామకాలపై అధ్యయనం చేసి ఫైనల్ చేయడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.