ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అక్కడ కొండచరియలు విరిగిపడి బురద ధాటిక ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో దాదాపు 170 మంది మృత్యువాత పడ్డారు. వందలాది ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వయనాడ్‌లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.