కొవిడ్ భయంతో మూడేళ్లు ఇంటికే పరిమితం

5683చూసినవారు
కొవిడ్ భయంతో మూడేళ్లు ఇంటికే పరిమితం
కరోనా భయంతో ఓ మహిళ తన కుమారుడితో కలిసి మూడేళ్లు ఇంట్లోనే నిర్బంధమైన ఘటన హర్యానా గురుగ్రామ్ లో జరిగింది. మున్ మున్ అనే మహిళ భర్త సుజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైద్య సిబ్బంది సహాయంతో ఆమెను మంగళవారం బయటకు తీసుకొచ్చారు. ఈ మూడేళ్లలో ఆమె తన భర్తను సైతం లోపలికి రానివ్వలేదని దీంతో అతను అక్కడే ఓ ఇల్లు తీసుకుని ఉండేవాడని పోలీసులు తెలిపారు. సరుకులు బయట పెడితే ఆమె తీసుకునేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్