ఉత్తరప్రదేశ్‌లో నిర్వహిస్తున్న వార్షిక కన్వర్ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్ టౌన్ సథేరి గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఒక ట్రక్కు బోల్తాపడి సుమారు 10 మంది కన్వరియాలు గాయపడ్డారు. గంగా జలాల సేకరణకు ఆగ్రా నుంచి హరిద్వార్‌కు కన్వరియాలు బయలేదిరినప్పుడు వాహనం టైరు పేలిపేవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు.