తొండలు, బల్లులను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్: BRS

79చూసినవారు
తొండలు, బల్లులను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్: BRS
రేవంత్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సెటైర్లు వేసింది. గాంధీ భవన్ దగ్గర మెట్రో పిల్లర్ కు 'ట్రాన్స్ ఫార్మర్స్ దగ్గర తొండలు, బల్లులు, ఉడుతలు పెట్టేవాళ్ళు కావలెను' అని ప్రకటన చేసింది. దీనిపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. 'తొండలు, బల్లులు, ఉడుతలను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ భజన బ్యాచ్ త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం.. మంచి తరుణం మించిన దొరకదు. అర్హులు వెంటనే గాంధీ భవన్‌కు వెళ్ళి అప్లై చేసుకోండి' అని సెటైరికల్ కామెంట్ చేసింది.

సంబంధిత పోస్ట్