కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్: మాజీ మంత్రి

84చూసినవారు
కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్: మాజీ మంత్రి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి అబద్ధం ఆడి, రైతులను మోసం చేశారన్నారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని.. రైతుల ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం అత్యంత బాధాకరం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్