కేరళ త్రిక్కాకరకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి మంత్రి సాజీ చెరియన్‌తో కలిసి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఆమె 15 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తల, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.