ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ చర్యల వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది. ఈ సవరణలను సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.