జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరణ అంశంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానిది, నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి వైఖరి ఒకేలా ఉందని వ్యాఖ్యానించారు. "కాశ్మీర్ లోయలో మంచి ఉనికిని కలిగి ఉన్న కాంగ్రెస్ & నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370, 35ఏ పునరుద్ధరణను ప్రధాన ఎన్నికల అంశంగా చేశాయి" అని ఆసిఫ్ చెప్పారు.