TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో ఈనెల 14 నుంచి విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూట్ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సచివాలయంలో ఈ ఉత్సవాల నిర్వహణపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవాలు డిసెంబర్ 9 దాకా ఉంటాయని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.