సీఎం రేవంత్ రెడ్డిని తొలగించాలని మంత్రులే గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ను తొలగించేందుకు నిశ్శబ్ధంగా భారీ కుట్రలు చేస్తున్నారని అన్నారు. హైడ్రా, మూసీ, గ్రూప్-1 అంశాల్లో రేవంత్ అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.