పాదు చిక్కుడు పంటకు చాలా చోట్ల వేరుకుళ్లు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా ఈ తెగులు ఒక మొక్క నుండి మరో మొక్కకు ఆశిస్తుంది. కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు. తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. దీంతో ఇతర మొక్కలకు తెగులు ఆశించకుండా ఉండి, మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారం ఉంటుంది.