గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే సందర్భంగా యూపీలోని గ్యాంగ్‌స్టర్ అజయ్ థాకూర్ బ్లాక్ కార్లతో స్టంట్ చేశాడు. 12 నలుపు రంగు కార్లతో అతను తన గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ కార్లకు బ్లాక్ ఫిల్మ్స్ వేసి, నెంబర్ ప్లేట్లు లేకుండా కాన్పూర్ సిటీలో హంగామా చేశాడు. అంతేకాదు సిటీలోని డీసీపీ ఆఫీసు వద్ద గట్టిగా హారన్లు కూడా మోగించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అజయ్ థాకూర్‌ను అరెస్టు చేశారు.