AP: సీఎం చంద్రబాబు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అసలు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఈ ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.