క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తనను మోసం చేయలేదన్న భార్య ఉమ్మీ అహ్మద్‌

55చూసినవారు
క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తనను మోసం చేయలేదన్న భార్య ఉమ్మీ అహ్మద్‌
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తన భార్యను మోసం చేశాడనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో తాజాగా షకీబ్‌ భార్య ఉమ్మీ అహ్మద్‌ శిశిర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయొద్దని ఆమె కోరారు. భర్తగా, తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడని తెలిపింది. పాక్‌, బంగ్లా మధ్య టెస్టు సిరీస్‌ ఆడేందుకు షకీబ్‌ పాక్ కు వెళ్ళాడు.

సంబంధిత పోస్ట్