తెలంగాణలో నేరాల సంఖ్య పెరిగిందని రాష్ట్ర జైళ్ల శాఖ నివేదికలో వెల్లడించింది. ఒక్క ఏడాదిలో ఖైదీల సంఖ్య 31% పెరిగినట్లు తెలిపింది. 2023లో 31,428 మంది నేరాలు చేసి అరెస్ట్ అవ్వగా, 2024కి వచ్చే సరికి 31% పెరిగి 41,138 మంది అరెస్ట్ అయ్యారని పేర్కొంది. 2023లో ట్రయల్ కింద 20,717 మంది అరెస్ట్ కాగా, ఆ సంఖ్య 2024కి వచ్చేసరికి 45.58% పెరిగి 30,153 అయ్యిందని జైళ్ల శాఖ నివేదికలో తెలిపింది.