భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌పై నెట్టింట విమర్శలు (వీడియో)

55చూసినవారు
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాస గృహంలో గురువారం జరిగిన గణేశ్ పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనడంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారడంపై నెటిజన్లు, విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని, చీఫ్ జస్టిస్ కలయిక ఆందోళనకర సందేశాన్ని పంపుతోందని ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షకులు, రాజకీయ నాయకులు ఇలా కలవడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్