తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

50చూసినవారు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 45,825 మంది భక్తులు దర్శించుకోగా.. 21,380 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రథ సప్తమి సందర్భంగా ఇవాళ ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్