దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. పండుగను పురస్కరించుకొని ప్రజలు ప్రముఖ ఆలయాలను, నదులను సందర్శిస్తున్నారు. తాజాగా యూపీలోని యుయనా నది తీరంలో ఉన్న ఘాట్లలో భక్తుల సందడి నెలకొంది. ఈ క్రమంలో వైదవ్యం పొందిన పలువురు మహిళలు అక్కడి కేశీ ఘాట్లో దీపావళి సంబరాలు చేసుకుంటూ కనిపించారు. ఈ సదర్భంగా వారు దీపాలు వెలిగించి, ఒకరికి ఒకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.