దారుణం.. పిన్ని అంటూనే పీక కోశాడు

55చూసినవారు
దారుణం.. పిన్ని అంటూనే పీక కోశాడు
AP: పిన్ని.. పిన్ని అంటూనే బంగారం కోసం మహిళ పీక కోశాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. కమలాపురం పట్టణంలోని గిడ్డంగివీధిలో లక్ష్మీదేవి, శేఖర్ దంపతులు నివసిస్తున్నారు. అదే వీధిలో ఉండే నవీన్ పిన్ని అంటూ లక్ష్మీదేవిని పలకరించేవాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడి అప్పులపాలైన నవీన్ కన్ను లక్ష్మీదేవి బంగారంపై పడింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవిపై కత్తితో దాడి చేసి బంగారంతో పరారయ్యాడు. చికిత్స పొందుతూ లక్ష్మీదేవి ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్