వికారాబాద్ జిల్లా కోట్ మర్బల్లిలో దారుణ ఘటన వెలుగుచూసింది. బంగారం కోసం ఓ వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేశారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు వృద్ధురాలి మెడలో ఉన్న బంగారాన్ని దొంగిలించి ఆమెను దారుణంగా హతమార్చారు. ఆపై మృతదేహాన్ని బావిలో పడేసి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.