TG: కరీంనగర్‌లో దారుణం జరిగింది. తాగుదాం అని ఫ్రెండ్‌ని పిలిచి చంపేశారు. కరీంనగర్‌లో నివాసముంటున్న రాముని అతని స్నేహితుడు సంతోష్ పార్టీ చేసుకుందామని పిలవడంతో వెళ్ళాడు. దారిలో వీరిద్దరికి మరో ముగ్గురు తోడయ్యారు. వీరంతా కలిసి మద్యం సేవించారు. అనంతరం స్నేహితులకు రాముకు మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో అందరూ కలిసి రాముపై దాడి చేసి అతని కళ్లు పీకేశారు. అక్కడితో ఆగకుండా బలంగా కొట్టడంతో రాము అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.