TG: హనుమకొండ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. నర్సక్కపల్లిలో ట్రాలీ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మహిళా కూలీలకు గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో ఆటోలో 30 మంది కూలీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులంతా కమలాపూర్ మండలం గూడూరు వాసులని తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.