పాకిస్థాన్‌కు చెందిన ముహమ్మద్ రషీద్ అనే మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు తన టాలెంట్‌ను ఈ ఏడాది మే 19న వెరైటీ ప్రపంచానికి చాటిచెప్పాడు. అర నిమిషంలో ఏకంగా 39 కూల్ డ్రింక్ క్యాన్లను తన నుదుటితో పగలగొట్టి ఔరా అనిపించాడు. ఇంకేముంది.. అతని అరుదైన ఫీట్‌ను చూసిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు రషీద్ పేరును వారి పుస్తకంలోకి ఎక్కించేశారు. ‘30 సెకన్లలో తలతో అత్యధిక డ్రింక్ క్యాన్లను నుజ్జు’ చేసిన రికార్డును అతనికి కట్టబెట్టేశారు.