ప్రస్తుతం భారతదేశంలో మంకీపాక్స్ కేసులు లేవని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించినట్టు వెల్లడించింది. ఆరోగ్య అధికారులను అప్రమతతం చేయడంతో పాటు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ మంకీపాక్స్ యొక్క పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపింది.