ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు

64చూసినవారు
ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు
దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పలు ఫిర్యాదులు అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ముఠాల కోసం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లారు. దేశవ్యాప్తంగా మొత్తం 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లో స్పెషల్ ఆపరేషన్ చేసిన పోలీసులు 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్