నికరాగ్వా దేశంలోని జినోటెగా ప్రాంతంలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలైన జోసెలింగ్ వెనెస్సా రోడ్రిగ్జ్ (23) పై పట్టపగలు దాడి చేసి.. తలపై తుపాకీ గురిపెట్టి కాల్చి చంపేశాడు. అనంతరం ఘటనా స్థలి నుంచి పారిపోయాడు. నిందితుడు బాధితురాలి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు.