పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాలు తొలిరోజు లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.