'తమిళనాడు గవర్నర్ VS తమిళనాడు ప్రభుత్వం' కేసులో 391 పేజీలతో ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు, రాష్ట్ర పతి పాత్రపైనా కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ పంపించిన బిల్లులపై ఆర్టికల్ 200 ప్రకారం, రాష్ట్రపతి 3 నెలల్లోగా తప్పక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఒకవేళ, ఏదేని కారణంతో ఆలస్యమవుతుంటే.. దానికి కారణాలను రికార్డు చేయాలని, వాటిని స్పష్టంగా రాష్ట్రాలకు తెలియజేయాలని పేర్కొంది.