అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారని కొందరిని పోలీసులు కారణం లేకుండా అరెస్టు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్‌కు ముందు నిందితుడికి కారణాలు చెప్పాలని, లేకుంటే బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టు సమయంలో కారణాలు చెప్పడం తప్పనిసరి అని, ఆ నిబంధనను ఉల్లంఘిస్తే దానిని బెయిల్‌కు ఆధారంగా పరిగణించవచ్చని వెల్లడించింది.