యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

50చూసినవారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా ఉస్రహార్‌లో చోటు చేసుకుంది. లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం రాత్రి 60 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. లఖ్‌నవూ నుంచి ఢిల్లీ వెళ్తున్న కారు డ్రైవర్‌ నిద్రలోకి జారుకొని తప్పుడు మార్గంలో వచ్చాడు. బస్సు కారును ఢీకొని గుంతలో బోల్తా పడింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్