గోదావరి నదిలో వరద ప్రవాహం దోబూచులాడుతోంది. దిగువన వరద తగ్గుతుండగా.. ఎగువన పెరుగుతోంది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఖమ్మం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. దీంతో గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని కేంద్ర జలసంఘం అధికారులను హెచ్చరించింది.