ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి రజత పతకం సాధించింది. దీపికాపై 0-6 తేడాతో విజయం సాధించిన లి జియామన్ స్వర్ణం కైవసం చేసుకుంది. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు వరల్డ్‌కప్ ఫైనల్‌లో పోటీ పడి ఐదు రజతాలను సొంతం చేసుకుంది. ఒక కాంస్య పతకం కూడా సాధించింది. భారత్ తరపున డోలా బెనర్జీ మాత్రమే బంగారు పతకం సాధించడం గమనార్హం.