జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో కబ్జాకు గురైన 1,260 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కో ఆపరేటివ్ సొసైటీ లే అవుట్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన స్థలం కబ్జాకు గురైందని తెలుసుకున్న మేయర్ విజయలక్ష్మి స్వయంగా వెళ్లి పరిశీలించారు. దీంతో వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ముగ్గురు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఉపయోగిస్తున్నారని తెలియడంతో నిర్మాణాలను తొలగించారు.