“యుజ్” అనగా “కలయిక” అనే సంస్కృత ధాతువు నుంచి “యోగ” లేదా “యోగము” అనే పదం ఉత్పన్నమైంది. “యుజ్యతేఏతదితి యోగః”, “యుజ్యతే అనేన ఇతి యోగః” వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడింది. యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానసిక శక్తులన్నింటిని ఏకం చేసి ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు వెళ్లడమే యోగ. “యోగము” అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి.